అన్నార్తులకు అండగా నిలిచిన మంత్రి ఎర్రబెల్లి..

149
minister errabelli
- Advertisement -

అందరూ తనను దయన్నా అని ఎంతో ఆప్యాయంగా పిలిచే పేరును మరోసారి సార్ధకం చేసుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తన వద్ద పనిచేస్తూ అకాల మరణానికి గురైన ఓ వ్యక్తి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవడమే కాక, వారి పిల్లలను చదివిస్తూ, ఆర్థికంగా సహాయం చేస్తూ, ఇప్పుడు అతని భార్యకి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇప్పించారు. ఈరోజు నియామక పత్రాలను అందజేసి… ఆపదలో ఉన్న అన్నార్తుల పాలిట నిజంగానే దయామయుడిగా మారారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఇక విషయంలోకి వెళితే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్ద సోషల్ మీడియా పనులు చూడ్డానికి పూర్ణ చందర్ అనే వ్యక్తి ఉద్యోగంలో చేరారు. మంచి పేరు తెచ్చుకున్న పూర్ణచందర్ ఆ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. దీంతో అతడి కుటుంబం వీధిన పడింది. భార్య రామేశ్వరి దేవి ఇద్దరు పిల్లలు ఒంటరి వారయ్యారు. విషయం తెలిసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ కుటుంబాన్ని చేరదీశారు. ఆర్థికంగా సహాయం చేశారు. పిల్లలిద్దరి చదువు బాధ్యతలు తీసుకున్నారు. ఆ పిల్లలిద్దరిని ఇప్పుడు మంత్రి చదివిస్తున్నారు. ఇదే క్రమంలో పూర్ణ చందర్ భార్య రాజేశ్వరి దేవి స్టాఫ్ నర్స్ కోర్సు పూర్తి చేసి ఉన్నందున ఆమెకున్న అర్హతల మేర, ప్రభుత్వ ఉద్యోగానికి సాయం అందించారు. ఇప్పుడు ఆమె ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్‌గా ఉద్యోగం పొందారు. ఆ నియామక పత్రాలను స్వయంగా మంత్రి ఇ రాజేశ్వరి దేవికి అందజేశారు. అందరి చేత ఔరా! అనిపించుకున్నారు. తనను నమ్మిన వారిని చేరదీసి, ఎంత సాయమైనా చేయడానికి వెనుకాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దాతృత్వాన్ని చూసి ప్రజలు అభినందిస్తున్నారు. దయన్న దయామయుడు అందరివాడు అంటూ కొనియాడుతున్నారు.

దయన్న కి జీవితాంతం రుణపడి ఉంటాం: ఈశ్వరి దేవి
నాలుగు జీతపు రాళ్ళ కోసం ఉద్యోగంలో చేరి అనుకోకుండా జరిగిన ఆక్సిడెంట్‌లో మృతి చెందిన తన భర్త పూర్ణ చందర్ ఆత్మ సంతోష పడే విధంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ కుటుంబాన్ని ఆదుకున్నారని రాజేశ్వరి దేవి అన్నారు. ఆర్థికంగా సహాయంగా ఉండడమే కాక నా పిల్లల్ని చదివిస్తూ చివరికి ఉద్యోగం కూడా ఇప్పించి మా కుటుంబాన్ని నిలబెట్టారని మా కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకున్నారని ఆమె అన్నారు. తమ కుటుంబం మొత్తం ఆజన్మాంతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి, వారి కుటుంబానికి రుణపడి ఉంటామని.. వారు ఎల్లకాలం ప్రజాజీవితంలో సేవ చేస్తూ, అందరి మన్ననలు పొందుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -