ప్రజలతో మమేకమౌతున్న మంత్రి ఎర్రబెల్లి..

59
minister errabelli

ఆ పూలమ్మ పూలు… అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి ప్రజలను ఓట్లు అడిగారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థి జెర్రి పోతుల ప్రభుదాస్‌తో కలిసి, మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగాంగా మంత్రి ఎర్రబెల్లి ప్రతి ఓటరును కలుస్తున్నారు.. ఓటర్లతో ప్రత్యేకంగా ఫోటోలు దిగుతూ, యువతని ఉత్సాహ పరుస్తూ, కాలనీల్లో కలియ తిరుగుతున్నారు. ఓటర్ల పనుల్లో, వారి కార్యక్రమాల్లో మమేకం అవుతూ, ఆయా కాలనీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మంత్రి ఎర్రబెల్లి.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీలో టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని.. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు మంత్రి‌. మీకు మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎం కేసిఆర్ ఆశీర్వాదం, కేటీఆర్ ల సహకారంతో మొత్తం హైదరాబాద్ విశ్వ నగరంగా మరుతున్నదన్నారు మంత్రి ఎర్రబెల్లి దరయాకర్‌ రావు.

సీఎం కేసీఆర్ మంచి పరిపాలకుడు. ఆయన ప్రజల సంక్షేమం కోసం చాలా ముందు చూపుతో వున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి వుండటం మన అదృష్టం. మీరు అడగకున్నా, మీ కష్టాలు తెలుసు కాబట్టి మీ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ వ్యాప్త నగరంగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి తెలిపారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తు కి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జీహెచ్‌ఎంసీని మరింతగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.