కాంగ్రెస్, బీజేపీలను నమ్మకండి- మంత్రి ఎర్రబెల్లి

162
errabelli
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా 4వ డివిజన్ మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో పలు సమావేశాలు, బైక్ ర్యాలీ వంటి అనేక కార్యక్రమాల్లో డివిజన్ ఇంఛార్జి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో మీర్‌పేట్ హెచ్ బి కాలనీ ఫేస్ 2 లోని రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్‌లో పద్మశాలి సంఘం మిత్రులతో మంత్రి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే హెచ్ బి కాలనీ లోని పార్టీ కార్యాలయంలో దర్జీ, కూర్మ సంఘం ఆత్మీయ సమావేశం, వెంకటేశ్వర కాలనీలో ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి. రాజీవ్ నగర్, ఎన్టీఆర్‌ నగర్‌లో చర్చిల, వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశాలలో పాల్గొని వారి మద్దతు కోరారు. దీనికి అన్ని సంఘాల వారు సానుకూలంగా స్పందించి టీఆర్‌ఎస్‌ పార్టీకే మా ఓటు వేస్తామని తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కెసీఆర్,మంత్రి కెటీఆర్ లు హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తున్నారు. అతిత్వరలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా 5 ఐటీ పార్కు లకు శంకుస్థాపన చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మకండి. వాళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు. మేము మాత్రం ఎన్నికలకు సంబంధం లేకుండా అభివృధ్ధి చేస్తున్నాం. మీర్‌ పేట్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ప్రభుదాస్‌ను గెలిపించాలని మంత్రి కోరారు.

- Advertisement -