ఉమ్మడి వరంగల్ జిల్లాలో 31 పాజిటివ్ కేసులు..

133
errabelli

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ అర్భన్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టిందన్నారు.

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో కోవిడ్-19 వైరస్ ను అడ్డుకోగలుగుతున్నాం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారిలో కరోనా లేదని…డిల్లీ మర్కజ్ కు వెళ్లివచ్చిన వారితో కొంత మేరకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందన్నారు.

మర్కజ్ పర్యటనకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ లో ఉంచడం జరిగిందని…ఉమ్మడి జిల్ఇప్పటి వరకు 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. పాజిటివ్ కేసుల్లో చికిత్స అనంతరం ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు…ఇంకా 29 మంది హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఎంతటి విపత్తును అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. ప్రభుత్వ అన్ని నిర్ణయాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని… వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం అన్నారు.