రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు మొదటి విడతలో రూ.200కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాబివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. మహిళ సంఘాలు తీసుకునే రుణాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని తాజాగా విడుదల చేశారు. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మహిళా సంఘాలను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిధులు విడదల చేశారన్నారు.
మహిళా సంఘాలకు గతంలో ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. మహిళా శక్తిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.1698 కోట్లు కేటాయించారని అన్నారు.