ఎవరికైనా అండగా నిలవాలన్నా, ఎవరినైనా ఆదుకోవాలన్నా ఆయన స్టైలే వేరు. కరోనా కష్టకాలంలో వేలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఆయన వరస అందరినీ ఆశ్యర్య పరచింది. అంతెందుకు వైరస్ విస్తరణలోనూ ప్రజలకు భరోసానిస్తూ ఆయన ప్రజాక్షేత్రంలో తిరిగిన వైనం ఎంతో మందినో అబ్బుర పరచింది. నిధులు సేకరించి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి అందచేసిన కోట్లాది రూపాయల వితరణ కూడా అందరినీ ఆహా అనిపించింది. అందరూ దయన్నగా పిలిచే తన పేరుని సార్థకం చేసుకుంటూ ఇప్పుడు మరోసారి తన ఉదారతని చాటుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంకు వచ్చే రైతు బంధు డబ్బులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి స్వయంగా అందచేసి, ఉడుతా భక్తిని చాటుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే చాలు ఆయన చేతికి ఎముకలేదంటారు. దయన్నా అని పిలిస్తే చాలు… నేనున్నానని ముందుకు వస్తారు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన ఉదారతని చాటుకున్నారు. తనకు వ్యవసాయ క్షేత్రానికి వచ్చే రైతు బంధు డబ్బులు రూ.లక్షా 45వేల రూపాయలను నేరుగా సీఎం కెసిఆర్ ని కలిసి అంద చేశారు. ఆ నిధిని కరోనా కష్ట కాలంలో పేదల కోసం వాడాల్సిందిగా కోరారు. ఇందుకు మంంత్రి ఎర్రబెల్లిని సిఎం కెసిఆర్ అభినందించారు. అనునిత్యం ప్రజల కోసం పరితపించే అసలు సిసలైన నేతగా నిలిచావంటూ కొనియాడారు. ఇందుకు సీఎం గారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.