రాష్ట్రంలో దేవాలయాల, చారిత్రక ప్రాంతాల అభివృద్ధి..

64
errabelli

తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో శుక్రవారం నాడు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శ్రీ సీతారామచంద్రుల దేవాలయ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల వల్మిడిలో శ్రీ సీతారామచంద్రుల దేవాదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఈ నిధులలో 2 కోట్ల రూపాయలు దేవాలయ నిర్మాణానికి, మిగతా 3 కోట్ల రూపాయలు దేవాలయ సత్రాలు, అంతర్గత రోడ్లు, ఇతర సదుపాయాల కల్పనకు వ్యయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

పూర్వ కాలంలో వల్మిడిలో శ్రీరామచంద్రుడు సందర్శించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. తాము కోరగానే దేవాలయ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేవాలయ నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, యుద్ధ ప్రాతిపదికన కాంట్రాక్టర్ పూర్తి చేయాలని ఆయన కోరారు. పాలకుర్తి నియోజకవర్గంలో నున్న అన్ని దేవాలయాలు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.