అదితిరావు హైద‌రి..స్టన్నింగ్ లుక్

132
maha samudram

ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ క‌లిసి న‌టిస్తోన్న మ‌హా స‌ముద్రం సినిమాపై అంఛ‌నాలు ఆకాశాన్నంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ ఒక మెమ‌ర‌బుల్ మూవీగా నిలిచేలా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ చెప్ప‌కే..చెప్ప‌కే పాట‌ను ఈ నెల 6న విడుద‌ల‌ చేయ‌నున్నారు చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో హీరోయిన్ అదితిరావు హైద‌రి స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల ఈ చిత్రం నుండి విడుద‌లైన మాస్ సాంగ్ హే రంభ పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రెండవ పాట చెప్పకే … చెప్పకే … ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 14న ‘మ‌హా స‌ముద్రం’ విడుద‌ల‌వుతుంది.

నటీన‌టులు:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
ప్రొడ్యూస‌ర్‌: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం
కో ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గరిక‌పాటి
మ్యూజిక్‌: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: కొల్లా అవినాశ్‌
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
యాక్ష‌న్‌: వెంక‌ట్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖర్‌