రాయపర్తిలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి..

329
errabelli
- Advertisement -

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లో 14వ ఫైనాన్స్ నిధులు రూ.5లక్షల నిధులతో పూర్తి చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాయపర్తి బస్ స్టాండ్ ప్రాంగణం లో మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి …అనంతరం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం సబ్ స్టేషన్ నుంచి జయరాం తండ వరకు రూ. 40 లక్షల ఎస్ టి , ఎస్ డి ఎఫ్ నిధులతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి…కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది అయినా, కరోనా కేసులు అధికం అవుతున్నాయి.ప్రజలంతా స్వీయ నియంత్రణ తో, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

రైతుల కోసం సీఎం కేసీఅర్ ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్, srsp కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి రైతులు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నారు.రూ.1000 కోట్ల నిధులతో కల్లాలు, రూ.500 కోట్ల నిధులతో రైతు వేదికలు ఏర్పాటు చేస్తూ, రైతులు ఇబ్బందులు పడకుండా కేసీఅర్ చేస్తున్నారని చెప్పారు.

ఉపాధి పనులను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం దేశం లో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే…ప్రతి నియోజకవర్గ కేంద్రం కు ఒకటి చొప్పున 40 వేల మెట్రిక్ టన్నుల పంట ను నిల్వ చేసే సామర్ధ్యం గల గోదాముల నిర్మాణాలు చేపడుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -