రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండువగా మార్చారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాయపర్తి మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి …బతుకమ్మ, రంజాన్, క్రిస్‌మస్ పండుగల సందర్భంగా ప్రభుత్వమే ప్రజలకు బట్టలు అందించిన సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవని చెప్పారు. సీఎం కేసీఆర్ తన పరిపాలనాదక్షతతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనేలా చేశారన్నారు.
ప్రతి ఏడాది 1.2 కోట్ల మంది మహిళలకు చీరలు అందిస్తున్నామని, రాష్ట్రంలో 20,36,234 కుటుంబాలకు బతుకమ్మ చీరలు అందుతున్నాయని చెప్పారు. బతుకమ్మ చీరల కోసం ఈ ఏడాది రూ.317 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో 1,04,745 చీరలను అందిస్తున్నామని చెప్పారు.