ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు: మంత్రి ఎర్రబెల్లి

309
- Advertisement -

జనగామ జిల్లా ధాన్యం కొనుగోలుపై జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్, ఆయా శాఖల అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత అనుభవాల నేపథ్యంలో పకడ్బందీగా ధాన్యం కొనుగోలు జరపాలి. అధికారులు సమన్వయంతో మెలగాలి. రైతులను ముందే చైతన్య పరచండి అని ఆదేశించారు.

జనగామ జిల్లాలో 3లక్షల 67 వేల మెట్రిక్ టన్నుల అంచనా దిగుబడి వస్తుంది. ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. జనగామ జిల్లాలో యాసంగి -2021గాను 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అందుబాటులో 28లక్షల గోనె సంచులు, 4592 టార్పలిన్ లు, 203 తూకం యంత్రాలు, 5 గోదాములు, 35 రైస్ మిల్లు లు ఉంచాము. గ్రామానికి ఒక అధికారిని ఇంఛార్జి గా వేయండి అని మంత్రి సూచించారు.

గత అనుభవాల నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం, మాస్కుల వాడకం వంటి అంశాలను ప్రజలకు, ప్రత్యేకించి రైతులకు అర్థం అయ్యేలా చేయండి. కలెక్టర్, ఇతర అధికారులు ధాన్యం కొనుగోలును పర్యవేక్షించాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలును పరిశీలించాలి. వచ్చే వానాకాలం పంటలు, సాగుపై ఇప్పటి నుంచే అధికారులు సిద్ధం కావాలి అని మంత్రి ఆదేశించారు.

- Advertisement -