సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఆర్ కృష్ణయ్య

212
cm kcr
- Advertisement -

బిసి లకు నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వడం పట్ల బిసి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కాచిగూడలో 47 బిసి కుల సంఘాలు బిసి అభ్యర్థి భగత్‌కు మద్దత్తుగా ఇవాళ సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని.. అన్ని కుల సంఘాలతో మమేకం అయి భగత్‌కు ఓటు వేస్తాం బిసి సంఘాలు తెలిపాయి. నాగార్జున సాగర్ ఎన్నికల్లో బిసి అభ్యర్థి భగత్‌కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తామని వారు ముందుకొచ్చారు. బిసి కులాల అభ్యర్థి భగత్ టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. 47 బిసి కుల సంఘాలు ఇవాళ బిసి అభ్యర్థి భగత్‌కు మద్దత్తుగా ఇవాళ సమావేశం అయ్యామని తెలిపారు. నోములు నర్సింమయ్య చనిపోతే వాళ్ళ కొడుకుకు నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కు మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజల అభ్యర్థి భగత్ కు మేము మద్దతుగా నిలుస్తామని కృష్ణయ్య అన్నారు.

ప్రధాన పార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్టీ బిసిలకు టికెట్ ఇవ్వడం ఎంతో మంచి నిర్ణయం. నాగార్జున సాగర్‌లో అన్ని బిసి కులాలు భగత్ కు మద్దతు ఇవ్వాలి మెజారిటీతో గెలిపించాలి. అన్ని సంఘాలు ఒక్కతాటి పైకి వచ్చి నోముల భగత్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. నాగార్జున సాగర్ ఎన్నికల్లో బిసిల ఐక్యత సాధించాలని ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. నోముల నర్సిహయ్య పేదల పక్షపాతి ఆయన బిసిల కోసం పని చేసిన వ్యక్తి ఆయన కొడుకుగా భగత్ కు మనం మద్దత్తు తెలుపాలి అన్నారు.

త్వరలోనే అన్ని బిసి కులాల సంఘాలతో సమావేశం పెడుతాం.. నాగార్జున సాగర్‌లో మేము నోముల భగత్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తాం. బిసిల పిలుపు మేరకు కేసీఆర్ బిసిలకు టికెట్ ఇచ్చారు కనుక మనము కూడా గెలిపించుకోవాలి. స్వంత మనిషిలాగా నోముల భగత్ గెలుపు కోసం పని చేయాలి. నాగార్జున సాగర్ ప్రజలు కూడా నోముల భగత్‌ను గెలిపించుకోవాలి అని ఆర్‌ కృష్ణయ్య కోరారు.

- Advertisement -