మన జీవితాలను మనమే కాపాడుకోవాలి- ఎర్రబెల్లి

442
Errabelli Dayakar Rao
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లా వ్యాప్తంగా విదేశాల నుండి వచ్చిన 53 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది, వారిలో ఏ ఒక్కరికీ కూడా పాజిటీవ్ రాలేదు. వేరే రాష్ట్రం, వేరే జిల్లాల నుండి వచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారని మంత్రి అన్నారు.

ఈ కరోనా మ‌హ‌మ్మారిపై యుద్దం చేయడానికి గ్రామాలలో ప్రజలను చైతన్య పరుస్తున్నాము. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తాం. వచ్చేనెల ఒకటవ తారీకు నుండి గ్రామాలలో ధాన్యం కొనుగోలు ప్రారంబిస్తాం. కరోనాను కట్టడి చేయడంలో డాక్టర్లు, పోలీసు శాఖ పనితీరు చాలా బాగుంది. మనజీవితాలను మనమే కాపాడుకోవాలి, ఈపాపం మనదికాదు బయటి దేశం వాల్లది అన్నారు.

మన సంసృతి చాలా గొప్పది, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మన సంసృతిని పాటిస్తున్నారు. అల్లం, వెల్లుల్లి, పసుపు మన దేశ ఆహార అలవాట్లు ఎంతో ఆరోగ్యకరమైనవి. బయట తిరగకుండా ప్రజల్లోనే అవగాహన రావాలి. సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు గౌరవవేతనం సిఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయడం సంతోషకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -