సీఎం కేసీఆర్ వల్లే మన పల్లెలకు జాతీయ గుర్తింపు..

82
Minister Errabelli
- Advertisement -

జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వ శక్తి కరణ్ పురస్కారానికి ఇటీవల ఎంపిక అయిన మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్‌ శీలం లింగన్న గౌడ్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, అత్యధికంగా ప్రజలు పల్లెల్లో నివసిస్తుండటమే ఇందుకు కారణమని చెప్పారు. సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, అందువల్లే మన పల్లెలు దేశానికి పట్టుగొమ్మలుగా మారాయని చెప్పారు. ఈ మధ్య ప్రకటించిన జాతీయ ఉత్తమ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో 19 అవార్డులు దక్కాయి. అవన్నీ మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయి అనడానికి నిదర్శనం అని మంత్రి అన్నారు.

సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు మంత్రిగా తాను, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. అందుకే గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తూ జాతీయ స్థాయి పురస్కారాలను ఎంపిక అవుతున్నాయి అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పంచాయతీ అవార్డు 2022 సంవత్సరానికి తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి వరించిందని అన్నారు.

కరోనా పరిస్థితిలో సర్పంచ్ సేవను గుర్తు చేశారు. కరోనాతో మరణించిన వ్యక్తిని స్వయంగా ట్రాక్టర్‌పై తీసుకెళ్లి అంతక్రియలు చేశారు అని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రగతిని కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. లింగన్న గౌడ్‌ను అభినందించి, తన సహకారం ఎల్లపుడూ ఉంటుందని వెన్ను తట్టారు. కాగా తనను సత్కరించి, గ్రామ అభివృద్ధిలో తన సహకారం అందిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి లింగన్న గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -