గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేస్తాంః మంత్రి ఎర్రబెల్లి

500
Errabelli Dayakar Rao
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్ధాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లాలోని దేవరుప్పల మండల కేంద్రలో నేడు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి. ఈకర్యక్రమంలో జీసీసీ చైర్మన్ మోహన్ గాంధీ నాయక్, జడ్పీటీసీ పల్లా భార్గవి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందంజలో ఉంచడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని విశ్వసిసస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలకు మనుగడ లేదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామి ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ జిల్లాను అభివృద్దిలో ముందుంచాలన్నదే నా ధ్యేయం అని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -