మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితోనే కరోనా వ్యాప్తి..

258
minister errabelli
- Advertisement -

కోవిడ్ -19, ధాన్యం,మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లతో కలిసి వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్ లు రాజీవ్ గాంధీ హన్మంతు, హరిత, సీపీ రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో కోవిడ్-19 వైరస్ ను అడ్డుకోగలుగుతున్నామన్నారు. రైతులకు, సామాన్యులకు, అన్ని వర్గాల ప్రజానికాన్ని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారిలో కరోనా లేదు. డిల్లీ మర్కజ్ కు వెళ్లివచ్చిన వారితో కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది. మర్కజ్ పర్యటనకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 29 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారితో సంబంధాలు ఉన్నవారిలో వరంగల్ అర్భన్ జిల్లాలో 35, జనగామ జిల్లాలో 5 గురికి నెగిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు.

ఎత్తటి విపత్తులనైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. దీనికి ప్రజలు సహకరించాలి. వైద్య సమస్యలు, వైద్య సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 7993969104, 7995118405, 9392469344 కు వాట్సప్, వీడియో కాల్ ద్వారా పరిష్కారం చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కోన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..కరోనా కట్టడి కి సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు చేపట్టారు.రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 835 దాన్యం కొనుగోలు కేంద్రాలు, 265 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశాం. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 10లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళనకు గురికావద్దు.

- Advertisement -