కారు గుర్తుకు ఓటు వేస్తే, అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేసినట్లే..

48
errabelli dayakar

రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం భాగాంగా కోలాటం ఆడుతూ…నృత్యాలు చేస్తూ…అందరినీ పలకరిస్తూ… కృష్ణ నగర్, వెంకటేశ్వర నగర్, బీకే నగర్‌ తదితర కాలనీలలో ఇంటింటి ప్రచారం చేస్తూ, ప్రజలను ఓట్లు అడిగారు. ఓటర్ల ఇండ్లల్లోనే, బర్త్ డే కేకులు కట్ చేస్తూ, అల్పాహా రాలు, చాయ పానీయాలు, భోజనాలు చేస్తూ, మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో జనంతో మమేకమైన ప్రచారంలో పాల్గొంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అలాగే మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థి జె ర్రి పోతుల ప్రభుదాస్‌తో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఓటరును కలుస్తున్న దయన్న.. ఓటర్లతో ప్రత్యేకంగా ఫోటోలు దిగుతూ, యువతని ఉత్సాహ పరుస్తూ, కాలనీల్లో కలియ తిరుగుతున్నారు. ఓటర్ల పనుల్లో, వారి కార్యక్రమాల్లో మమేకం అవుతూ, ఆయా కాలనీల్లో కలియ తిరుగుతున్నారు మంత్రి. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో కి టిడిపి నుండి యువత భారీగా సంఖ్యలో చేరారు. మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీలో టీఆర్‌ఎస్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలి. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంత్రి దయన్న.మీకు మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.సీఎం కేసిఆర్ ఆశీర్వాదం, కేటీఆర్ ల సహకారంతో మొత్తం హైదరాబాద్ విశ్వ నగరంగా మరుతున్నదన్నారు మంత్రి ఎర్రబెల్లి దరయాకర్‌ రావు.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రశాంత హైదరాబాద్ కావాలా? అల్లకల్లోల నగరం కావాలా?.. మీరే ఆలోచించాలని.. గతంలో ఎన్నడూ లేనంతగా శాంతి భద్రతలు హైదరాబాద్‌లో నెలకొన్నాయి.నయీంలు లేరు. నయా గూండాలు, రౌడీలు లేరు. ప్రజలు సుఖ శాంతులతో, సంతోషాలతో ఉన్నారు అని తెలిపారు. సుఖ శాంతుల తెలంగాణ కావాలా? అల్లర్లు, ఆందోళనల తెలంగాణ కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలి. ఢిల్లీల ఉండేటోల్లు, మన గల్లీ లను బాగు చేస్తారా?..ప్రజలు బాగా ఆలోచించుకోవాలి.అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేయాలి.. కారు గుర్తుకు ఓటు వేస్తే, అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేసినట్లే.. ప్రజలు అడిగినవన్నీ చేస్తూనే, అడగని అనేక పథకాలు చేపట్టిన ఘనత మన సీఎం కేసిఆర్ ది, మంత్రి కేటీఆర్ లది అని మంత్రి పేర్కొన్నారు.

కెసిఆర్ ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు మేలు చేస్తాయి..

-డిసెంబర్ నుంచి జీహెచ్‌ఎంసీ ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరా.
-ఈ డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 67 వేల సే లూ న్ల కు ఉచిత విద్యుత్.
-రజకులకూ ఉచిత నీరు, ఉచిత విద్యుత్.
-కరోనా సమయంలో నష్టపోయిన అన్ని షాప్ లకు 6 నెలల కరెంట్ బిల్లుల నుంచి మినహాయింపు.
-కరోనా సమయంలో నడవని వాహనాలకు టాక్స్ మినహాయింపు.
-మూసీ నది ఆధునీకరణకు నిర్ణయించారు.

ఈ పథకాలను ప్రజలెవరూ అడగలేదు. కానీ ప్రజలకు ఏమి అవసరమో, అవి చేసి పెడతారు సీఎం కేసీఆర్‌.ఇలాంటి అనేక పథకాలతో పాటు, హైదరాబాద్ నగరాన్ని విశ్వ వ్యాప్త నగరంగా తీర్చిదిద్దుతున్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో రెండో రాష్ట్రంగా తీర్చిదిద్దారు. మినీ ఇండియా లాంటి హైదరాబాద్‌ను అగ్రగామిగా చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్నందునే లక్షల కోట్ల పెట్టబడులు మన హైదరాబాద్ కి వస్తున్నాయి. ఇంత అభివృద్ధి హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి తెలిపారు. అందుకే, ప్రజలు ఆలోచించి, అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేయాలి. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తు కి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి కోరారు.

జీహెచ్‌ఎంసీని మరింతగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. డివిజన్ లోని అన్ని సమస్యలను నేను ఆకళింపు చేసుకున్నాను. వాటిని పరిష్కరించే బాధ్యత నాది అన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఈ ప్రచారంలో నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.