బీజేపీ స్వలాభం కోసం ప్రజలను మోసం చేస్తోంది- ఎర్రబెల్లి

51
errabelli

4వ మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్‌లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా పయనిస్తోంది. డివిజన్ ఎన్నికల ఇంచార్జ్ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆలోచనలు, నిర్ణయాలతో ప్రజలందరూ ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా గా హౌసింగ్ బోర్డ్ కాలనీ డివిజన్ లోని అన్ని కులాలు కుల సంఘాలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాయి ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని పిలిచి వారి సమక్షంలోనేలే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాసుని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తామన్నారు. మార్వాడీలు, వడ్డెరలు, కురుమ, గౌడ తదితర సామాజిక సంఘాలతో మొదలు మిగితా అన్ని కులాలు కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నాయి.

ఒకవైపు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు కాలనీలలో టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్ లకు ఆయా కాలనీల ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పూలమాల, శాలువా లతో సత్కరిస్తూ… టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి జెర్రిపోతుల ప్రభుదాసును భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెబుతూ టీఆర్ఎస్ పార్టీ కి బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ రోజు మంగాపురం ఎన్టీఆర్ నగర్, నరసింహ నగర్ కాలనీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బీజేపీ దేశాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి యుద్ధానికి ప్రేరేపించి, తమ స్వలాభం కోసం ప్రజలను మోసం చేస్తోందన్నారు. అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా మత ఘర్షణలు అల్లర్లు సృష్టించి ఓట్లను పొందే ఆలోచనలో ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తుంటే బీజేపీ వాళ్లు మాత్రం మత ఘర్షణలకు ఈ నగరాన్ని మార్చాలని చూస్తోందన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే వారితో హైదరాబాద్ నగర అభివృద్ధి కన్నా వారు చేసే లూటీ ల అభివృద్దే జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే డివిజన్ ని దత్తత తీసుకొని కడిగిన ముత్యంలా చేస్తానన్నారు మంత్రి ఎర్రబెల్లి.