బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు..

122
minister errabelli
- Advertisement -

వరంగల్ పట్టణం ఊహించని రీతిలో అభివృద్ధిలో ముందుంది. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో అనూహ్య అభివృద్ధి జరిగిందన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శనివారం ఆయన వరంగల్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళను కాదని, వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా, వరంగల్ ప్రజలు మంచి తీర్పు ఇస్తారనే నమ్మకం మాకు ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు వార్ వన్ సైడ్ లాగా టీఆర్ఎస్ పక్షానే ఉంటాయి. ఇప్పటికే చాలా అభివృద్ధి చేసాం.. ఇంకా చేస్తామన్నారు. ఇంకా మూడు సంవత్సరాలు మేము రాష్ట్రంలో అధికారంలో ఉంటాం. ఇప్పటి వరకు…ప్రతి ఎన్నికలలో మమల్నీ ప్రజలు ఆశీర్వదించారు. బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు..ప్రతి ఎన్నికలో ప్రజలు ఓడిస్తున్నా, బండి సంజయ్ కి బుద్ధి రావడం లేదు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని నాలుగో స్థానంలో ఉంచారు.ప్రతి రోజు ఇంటంటికి మంచి నీరు అందించడానికి తొమ్మిది వందల యాబై కోట్లు ఖర్చు పెట్టాం ..ఇది తప్పంటావా సంజయ్..బండి సంజయ్ అవగాహన ఊండి మాట్లాడాడా..లేక మాట్లాడాడా?..బండి సంజయ్ అవగాహన లేక మాట్లాడుతున్నాడు.. అభివృద్ధి కనపడత లేదా..? అని మంత్రి ప్రశ్నించారు.

వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్రం ప్రభుత్వం ఎమైనా ఇచ్చిందా?…ఎందుకు ఇవ్వలే…? ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు..?బండి పోతే బండి…గుండు పోతే గుండు…ఇలా అనేక హమీలు ఇస్తీవీ.. నుండి హైదరాబాద్, వరంగల్ కీ ఎమీ ఇచ్చారు..? బీజేపీ స్టేట్ మెంట్లకే పరిమితం… ఇచ్చిన ఒక్క హామీని ఇంప్లిమెంట్ చేయ్యలే…మెడికల్ కాలేజీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసాం…ఒక్కటి ఇవ్వలే..కరీంనగర్ లో ఎమీ చేయ్యలేని వాడు వరంగల్‌లో చేస్తానంటే నమ్మాలా?.. నిజామాబాద్ పసుపు బోర్డు ఎమైంది? అని మంత్రి దుయ్యబట్టారు. మీరే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తేస్తున్నాం..ఇస్తున్నాం అని ప్రకటనలు చేసారు..గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఇస్తామని హమీ ఇచ్చారు.. బండి సంజయ్! నీ మాటలు నమ్మేందుకు వరంగల్ ప్రజలు సిద్ధంగా లేరు అని మంత్రి అన్నారు.

వరంగల్ రూపురేఖలు మార్చేందుకు మేము మా సీఎం, కేటీఆర్ నిరంతరం కష్టపడుతున్నాం. హైదరాబాద్ ఎన్నికలలో మాయ మాటలు చెప్పారు..నాలుగు సీట్లు రాగానే ఆగలేదు.అది గ్రహించిన ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు. హైదారాబాద్ సిట్టింగ్ సీట్ సహా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఓడారు. ప్రజలు నాల్గవ స్థానానికి నెట్టేశారు. అయినా బుద్ధి రాలేదు. తగుదునమ్మా అని మళ్ళీ రెడీ అయ్యారు అని మంత్రి ఎద్దేవ చేశారు. కేంద్రం మెడలు వంచైనా కోచ్ ఫ్యాక్టరీ తేస్తాం..ల్యాండ్ ఇచ్చాం..ఇవ్వ లేదంటున్నారు..గిరిజన యూనివర్సిటీ ఆరువందల ఎకరాల ఇచ్చాం..గడిచిన ఆరున్నర ఎండ్లలో 1లక్షా 53 వేల కోట్లు రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్రం తీసుకుంది. కేవలం లక్ష నాలభై వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చారు. మా వాటా కూడా సరిగా ఇవ్వట్లేదు..మాకు వచ్చే వాటా ఇవ్వండి..అదనంగా రూపాయి వద్దు… మా హక్కు అది.. అని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య, TSIIC చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఇంఛార్జి గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యేలు రాజయ్య, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -