కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే..

268
errabelli
- Advertisement -

శనివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నియోజకవర్గ పరిధిలో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వ‌హించారు. ఎమ్మెల్సీ డి. రాజేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు గ్యాదరి బాలమల్లు, ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బొంతు రామ్మోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేన‌ని.. కాంగ్రెస్‌, బీజేపీల‌ను చిత్తుచిత్తుగా ఓడ‌గొట్టాల‌ని పిలుపునిచ్చారు. మీ కోరికలు న్యాయమైనవి. అందుకే ఎమ్మెల్యే నరేందర్ వాటిని తీరుస్తారు. నేను బాధ్యత తీసుకుంటాను. కాంగ్రెస్ పాలనలో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నపుడు మైనారిటీలకు రూ. 850 కోట్లు ఖర్చు పెడితే కేసీఆర్ వచ్చాక కేవలం తెలంగాణలోనే రూ. 5,712 కోట్లు ఖర్చు పెట్టారు.

చర్చిల అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫండ్ ఖర్చు పెట్టుకునే అవకాశం సీఎం కల్పించారు. మీకు ఏ కష్టం వచ్చినా కాపాడుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రంలో రిజర్వేషన్ తీసే కుట్ర బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. రైల్వే, బీఎస్ఎన్ఎల్‌, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేసి ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నం జరుగుతోంది.

- Advertisement -