సీఎం కేసిఆర్ రైతు పక్షపాతి- మంత్రి ఎర్రబెల్లి

126
Minister Errabelli
- Advertisement -

అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా వుంది అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నిన్న మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో అంకుశపూర్, ప్రతాప్ సింగారం గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రైతు వేదికలను మంత్రి మల్లా రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో స్వచ్ఛమైన కల్తీ లేని సేంద్రియ పద్ధతుల్లో చేసిన నిత్యావసర వస్తువులు దొరుకుతాయి అన్నారు.

అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా వుంది. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నేతృత్వంలో జరిగుతున్నది. రైతులకు సీఎం చేసినంతగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేదు. మన రాష్ట్రంలో రైతుల కోసం అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో, మరే రాష్ట్రం లోనూ జరగడం లేదు. సీఎం కేసిఆర్ రైతు పక్షపాతి..రైతుల ఆత్మ బంధువు..పేదల ఇంట్ల పెద్దన్న అని మంత్రి కొనియాడారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో సాగునీరు, ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి, రుణాల మాఫీ, పంటల కొనుగోలు.. ఇలా 18 రకాల పథకాలు అమలు అవుతున్నాయి.రైతాంగానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రం 10వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నదని మంత్రి వివరించారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి. మంచి చెడులను ఎంచుకుని… ఆలోచించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలు,నర్సరీ,వైకుంఠ ధామాలతో గ్రామాల్లో కొత్త అందాలుగా మారాయి. ఇప్పుడు గ్రామాల్లో రైతులకు కళ్ళాలు,రైతు వేదికలు,అంతర్గత రోడ్లు,డ్రైనేజీలు గ్రామాల మధ్య లింక్ రోడ్లు ఇట్లా అనేక విధాల అభివృద్ది కొనసాగుతున్నది. సీఎం ఆలోచనలతో పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు ట్రాక్టర్లను సమకూర్చడం జరిగింది. ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లను విడుదల చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -