తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ… ఇంటింటికీ సంక్షేమ పథకాలు, మారిన గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం-పల్లె ప్రగతి, పరిపాలనా సంస్కరణల్లో తండాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు, హరిత తెలంగాణలో నర్సరీలు, గతంలో దేశంలోనే ఎవరూ చేపట్టని, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేపట్టిన పథకాల్లో 2601 రైతు వేదికల ఏర్పాటు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు, బాధితులకు అందిస్తున్న అసరా పెన్షన్లు, ప్రతి ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు వంటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహిస్తున్న పలు అంశాలను రాష్ట్ర గవర్నర్ సోమవారం నాటి తమ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్థావించారు.
తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, దేశంలో అనేక అవార్డులు తెచ్చిన మిషన్ భగీరథ పథకం తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి అనుభవించిన మంచినీటి కష్టాలను రూపుమాపిందన్నారు. ఈ పథకం యావత్ దేశానికి ఓ టార్చ్ బేరర్ గా నిలిచిందన్నారు. మనం గర్వించాల్సిన విషయం అంటూ, వంద శాత ఇండ్లకు, అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కేంద్ర ప్రభుత్వ జల్ శక్తి మిషన్ ప్రకటించడం, గొప్ప ప్రశంసగా గవర్నర్ పేర్కొన్నారు. మారుమూల పల్లెలకు, గిరిజన తండాలకు, ఆదివాసీ గూడెంలకు, మిషన్ భగీరథ మంచినీరు అందుతుందన్నదన్నారు.
2014కు ముందు కేవలం 5,672 ఆవాసాలు మాత్రమే, అదీ పాక్షికంగా మంచినీరు అందేది. నేడు రాష్ట్రంలో 24,543 ఆవాసాల ప్రాంతాల్లోనిప్రతి ఇంటికీ ప్రతి రోజూ సురక్షితమైన నల్లాల ద్వారా సరఫరా అవుతుందని, 57,26,804 హౌజ్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. 65 ఇన్ టేక్ బావులు, 109 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 1,49,905 కి.మీ. పైప్ లైన్, 13,901 సర్వీస్ క్రాసింగ్ లు, ఈ బృహత్తర పథకంలో భాగంగా నిర్మితమైనట్లు చెప్పారు. స్కూల్స్, అంగన్ వాడీలు, రైతు వేదికలు, స్మశాన వాటికలకు 87,412 కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. మంచినీటి పథకాల కసం 2014కి ముందు 4,198 కోట్లు మాత్రమే వినియోగించగా, 2014 నుంచి ఇప్పటి వరకు 32,500 కోట్లు ఖర్చు చేసి, శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించినట్లు గవర్నర్ వివరించారు. మూడేళ్ళల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ఒక రికార్డు అని చెప్పారు.
మిషన్ భగీరథ పథకం వల్ల ఫ్లోరైడ్ పీడ విరగడ అయింది. కేంద్ర మంచినీరు, పారిశుద్ధ్య శాఖ పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రగా పేర్కొన్నదన్నారు. ఇది అద్భుతమైన విజయం, గత పాలకులు 60 ఏండ్లల్లో సాధించలేని ప్రగతిని కేవలం మూడేళ్ళల్లోనే సాధించడం తన ప్రభుత్వ ఘనతగా గవర్నర్ సగర్వంగా ప్రకటించారు.
సంపద పంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యతో ఇంటింటికీ సంక్షేమ ఫలాలను తన తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని గవర్నర్ ప్రకటించారు. పెరుగుతున్న తన ఆదాయాన్ని ప్రభుత్వం పేదలకే పంచుతున్నదన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 200 రూపాయలుగా ఉన్న పెన్షన్లను రూ.2,016, వికలాంగులకు రూ.500 నుంచి రూ.3016 పెంచి అందిస్తున్నది. ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు అందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడేనాటికి 26,21,828 మదిఇ మాత్రమే పెన్షన్లు అందగా, ఇప్పుడు 39, 36, 521 మందికి పెన్షన్లు అందుతున్నాయని గవర్నర్ వివరించారు. నాడు పెన్షన్ల కోసం 860 కోట్లు ఖర్చు చేయగా, నేడు 8,710కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే పల్లె ప్రగతితో గ్రామీణ ముఖ చిత్రమే మారిందని గవర్నర్ ప్రకటించారు. లంబాడీల, ఆదివాసీలు నివాసముండే అన్ని ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో 3,146 ఎస్టీలు సర్పంచ్ లుగా అయ్యే అవకాశం లభించింది. గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12,769కి పెంచి, ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అందే విధంగా ప్రతి నెలా రూ.308 కోట్లను విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని గవర్నర్ చెప్పారు. పల్లె ప్రగతి కింద నిరంతరం పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చుకున్నం. నర్సరీలు, డంపు యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, స్మశాన వాటికలు సమకూరాయి అన్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం వల్ల ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న పథకాల్లోనూ గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖలకు గవర్నర్ సముచితంగా ప్రస్థావించారు. మిషన్ భగీరథ మంచినీరు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఇమామ్, మౌజమ్ లకు భృతి వంటి అంశాలను గవర్నర్ వివరించారు.