ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం..

226
Eatala
- Advertisement -

ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో గొప్ప మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో డాక్టర్లు బయటకు రాకుండా, హాస్పిటల్స్ మూసివేసిన సందర్భంలో ప్రభుత్వ వైద్యులు సిబ్బంది ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పేషెంట్ కు చికిత్స అందించడం. గత ఆరు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేసిన పనులకు మంత్రివర్గ ఉప సంఘం అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా కేరళ తమిళనాడు తర్వాత మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. కెసిఆర్ కిట్ వంటి పథకాలు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకాన్ని మరింత పెంచాయి. MMR రేటు 92 నుంచి 63 కి IMR 39 నుంచి 27 కి తగ్గటంలో కెసిఆర్ కిట్ పాత్ర గణనీయంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున తగిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం అన్నారు.

ఆశా వర్కర్ల మొదలుకొని మిగిలిన అందరికీ మెరుగైన జీతం ఇవ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆశ వర్కర్స్ కి మొదట్లో కేవలం 1500 రూపాయలు జీతం ఉండగా ఇప్పుడు గణనీయంగా పెంచుకున్నాము. సబ్ సెంటర్లను వెల్నెస్ సెంటర్గా మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాము. ఇలాంటి మంత్రివర్గ నిర్ణయాలు అన్నింటినీ ముఖ్యమంత్రికి నివేదిస్తాము. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడికల్ కాలేజీలో వరకు తీసుకోవాల్సిన సంస్కరణలు.. సిబ్బంది నియామకం వైద్య పరికరాల మీద హాస్పిటల్ వారిగా పూర్తిస్థాయిలో చర్చించాము. వీటన్నింటి మీదా త్వరలోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ వైద్యంను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులు పని చేస్తారని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు.

కిడ్నీ, హార్ట్, లివర్ మార్పిడి శస్త్ర చికిత్స కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటన్నింటిని ఆరోగ్యశ్రీ కింద చేయాలని కమిటీ నిర్ణయించింది. కాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో MNJ క్యాన్సర్ హాస్పిటల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికీ 40 కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్ కోసం కేటాయించాము. పెట్ స్కాన్ కూడా ఏర్పాటు చేశాము. క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బస్తి దవాఖానాలు ప్రస్తుతం 198 ఉండగా.. ఈ నెలలో 26 ప్రారంభించు చున్నాము. మొత్తంగా మూడు వందల బస్తి దావఖాన లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ డయాగ్నొస్టిక్ పేరిట మూత్ర రక్త తెమడ పరీక్షలు ఇప్పటికే చేస్తున్నాము. వీటితో పాటుగా ఎక్స్రే, ఇసిజి, అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయబోతున్నాం. హైదరాబాద్ ను 8 జోన్లుగా విభజించి ఇప్పుడు ఉన్న బస్తి దావఖాన లకు వీటిని అనుసంధానము చేస్తాము. పేద ప్రజలకు వైద్య పరీక్షల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా పని చేయబోతుంది. 108 అంబులెన్స్ సౌకర్యాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్వహిస్తుంది. గతంలో మండలానికి ఒక అంబులెన్సు ఉండగా. కొత్త మండలాలు ఏర్పడిన నేపథ్యంలో వాటికి కూడా ఒక్కో అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము.

హైదరాబాద్ వరంగల్ వంటి ఆస్పత్రులలో అవసరానికి అనుగుణంగా ప్రతి ఆసుపత్రిలో ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గిఫ్ట్ ఏ స్మైల్ కింద 118.. ప్రభుత్వం 100 అంబులెన్సులు కొనుగోలు చేస్తున్నాం, మరో 20 అంబులెన్స్లో సిఎస్ఆర్ కింద ప్రభుత్వానికి అందాయి. మొత్తంగా 238 వాహనాలు కొత్తగా 108 సేవలను అందించబడుతున్నాయి. ప్రమాదాలు జరగడం ద్వారా మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా మంచానికే పరిమితమైన వారికి చికిత్స అందించేందుకు పాలియేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే 8 కేంద్రాలు నడుస్తున్నాయి. మరో రెండు కేంద్రాలను హైదరాబాదులో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాము. వీటి ద్వారా పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించవచ్చును. లాభాలను ఆశించకుండా నడిపిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం మద్దతు అందించి వాటి ద్వారా మరింత సేవ చేయాలని కమిటీ నిర్ణయించింది.

ఆరోగ్యశ్రీ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. దీనితోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ వందల కోట్లు ఇస్తున్నాము. వీటి అవసరాలు లేకుండా ఆయుష్మాన్ భారత్ కంటే 100 రెట్లు మెరుగైన సేవలు అందించేలాగా ఆరోగ్యశ్రీ లో మరికొన్ని వైద్య చికిత్సలను చేర్చభోతున్నాము. పేషెంట్ కు సంబంధించిన చరిత్రను నిక్షిప్తం చేయడానికి ఎలక్ట్రానిక్ రికార్డులు తయారు చేయు విధానము ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే చింతమడకలో పూర్తయింది. కంటివెలుగు కూడా విజయవంతంగా పూర్తి చేసాము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కవ్యక్తి హెల్త్ ప్రొఫైల్‌ను చేయబోతున్నాము. అనేక కొత్త పద్ధతులకు తెలంగాణలోని పునాది పడింది తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము ఆసుపత్రుల మీద నమ్మకం ఉంచి చికిత్స చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

అతి తక్కువ కాలంలో గవర్నమెంట్ పరంగా మెడికల్ షాప్ లు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించేందుకు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టుల భర్తీ చేయడానికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు కూడా క్లియర్ అయ్యాయి. కాబట్టి వాటన్నిటినీ రిక్రూట్ చేయబోతున్నాము. అదేగాక వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవటానికి ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరాల కొకసారి భర్తీ చేసుకోవడానికి మంత్రి వర్గ ఉప సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకమీదట డాక్టర్ల కొరత ఉండబోదు. కరోనా వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తామని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.

- Advertisement -