గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి..

138
Minister mallareddy

రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విస్తరించిందని, మనదేశంలో ప్రముఖులందరూ బాగస్వాములవుతున్నారని మల్లారెడ్డి అన్నారు.

అయితే తన జన్మదిన సందర్బంగా ట్విట్టర్ వేదికగా నాకు శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు దానిని స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద , ఎమ్మెల్సీ శంబీర్పూర్ రాజ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు. వారు మొక్కలు నాటి ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరారు.

తన నియోజక వర్గంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి అందరు భాగస్వాములు కావాలని వారు కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Minister mallareddy