ట్రియంప్ విల్లాస్ కాలనీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌..

43

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజేంద్రనగర్ కిస్మతుపురాలోని ట్రియంప్ విల్లాస్ కాలనీవాసులు తమ కాలనీ సమావేశం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 25 పారిజాత మొక్కలను నాటడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా అద్భుతమైన కార్యక్రమం తీసుకొని ప్రజల్లో పర్యావరణం పట్ల చైతన్యం నింపడం జరుగుతుందని కొనియాడారు. తమకు పారిజాత మొక్కలు పంపిన చేసిన అరుణ ఫోటో స్టూడియో యాజమాని నిమ్మల సతీష్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఎస్‌ రావు, పద్మావతి, సునీతా రెడ్డి, బీనా, వనజా, అనితా తదితరులు పాల్గొన్నారు.