వేమూరి రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి అల్లోల..

19
Minister Allola

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనను, వారి కుటుంబాన్ని ఓదార్చి, త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఆర్కే సతీమణి వేమూరి కనకదుర్గ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.