ఆకర్షణీయ నగరంగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

193
minister ktr
- Advertisement -

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని తెలిపారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని వెల్లడించారు. లింక్ రోడ్లను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ఒక‌టి అని తెలిపారు.

ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటందని… మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప‌ట్ట‌ణీక‌ర‌ణ కూడా వేగంగా పెరుగుతుందని…హైదరాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీ, కాలుష్యాన్ని త‌గ్గించేందుకు మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి పాత ముంబై రోడ్డు లెద‌ర్ పార్క్ వ‌ర‌కు నిర్మించిన ఈ రోడ్డును ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే పూర్తి చేశామ‌న్నారు. దీన్ని నెక్లెస్ రోడ్డు మాదిరి డెవ‌ల‌ప్ చేయాల‌న్నారు. న‌గ‌ర అభివృద్ధికి ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌రం ఉంద‌న్నారు. లింక్ రోడ్ల విష‌యంలో ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తామ‌ని మంత్రి తెలిపారు.

లింకు రోడ్ల నిర్మాణానికి రూ. 313కోట్ల 65 ల‌క్ష‌లు మంజూరు చేశామని…. మ‌రో 100 లింక్ రోడ్ల‌ను అభివృద్ధి చేయ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా 137 లింక్ రోడ్ల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రుల స‌బితా ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

- Advertisement -