షకలక శంకర్… ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రొగ్రామ్ తో బాగా పాపులర్ అయ్యాడు ఈ కమెడియన్. శ్రీకాకుళం స్లాండ్ తో అదరగొట్టడం శంకర్ ప్రత్యేకత. సినిమా అవకాశాలు రావడంతో చాలా రోజుల క్రితమే శంకర్ జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. కట్ చేస్తే..
ఇప్పుడు శంకర్ కామెడీకి డిమాండ్ కూడా బాగానే పెరిగింది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతీ సినిమాలో శంకర్ అలరిస్తున్నాడు. అంతే కాదు రెమ్యూనరేషన్ విషయంలో బ్రహ్మానందానికి చేరువగా వచ్చేశాడు. శంకర్ ఒక రోజు పారితోషికం కింద లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడట. ఇప్పడున్న స్టార్ కమెడియన్లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కు ఇది సమానం. అంతేకాదు ఇదే జోష్ తో ఇప్పుడు నా కొడుకు పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ హీరోగా పరిచయం అవుతున్నాడు శంకర్. ఏదేమైనా.. అనతికాలంలోనే షకలక శంకర్ రెమ్యూనరేషన్ విషయంలో ఉన్నతస్థాయికి చేరాడు.