భోలక్‌పూర్ కార్పొరేటర్ అరెస్ట్…

40
mim
- Advertisement -

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు ముషీరాబాద్ పోలీసులు. గౌసుద్దీన్‌పై 353, 506 IPC సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

భోల‌క్‌పూర్ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు హోట‌ళ్లు, షాపులు తెరిచి ఉన్నాయి. దీంతో హోట‌ళ్ల‌ను, షాపుల‌ను మూసి వేయించేందుకు పోలీసులు అక్క‌డికి వెళ్లారు. వీరిని అడ్డుకున్నారు కార్పొరేట‌ర్ గౌసుద్దీన్.

రంజాన్ మాసం ముగిసే వ‌ర‌కు రాత్రి పూట కూడా హోట‌ళ్లు, షాపులు తెరిచి ఉంటాయ‌ని సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోతే.. మీరు రూ. 100కు పనిచేసే మనుషులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మంత్రి కేటీఆర్ సైతం ఈ ఘటనపై స్పందించారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం క‌లిగించిన వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని కోరారు.

- Advertisement -