ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ

81
pm modi
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు గవర్నర్ తమిళి సై. ప్రధాని నివాసంలో మోడీని కలిసిన గవర్నర్… రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపై చర్చించారు.

సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీలో పర్యటిస్తున్న తరుణంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలి కాలంలో రాజ్ భవన్ తో సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కౌశిక్ రెడ్డి ఫైల్ ను సీఎం కేసీఆర్ గవర్నర్ వద్దకు పంపారు. కానీ, ఆమె ఆ నామినేషన్ ను తిరస్కరించారు. ఈ విషయాన్ని మీడియా సమావేశం సందర్భంగా ప్రస్తావించారు తమిళి సై. తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ను అని ప్రజలకు అందుబాటులో ఉండే మనిషినని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతతోనే ఉన్నానని చెప్పారు.

- Advertisement -