మోడీకి షాక్‌….గోద్రాపై ఎగిరిన పతంగి!

238
owaisi
- Advertisement -

ఎప్పుడొచ్చాం కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా..ఈ డైలాగ్ ఇప్పుడు మజ్లిస్ అధినేత ఓవైసీకి సరిగ్గా సరిపోతుందేమో. ఒకప్పుడు పాతబస్తీ పార్టీగా ముద్రపడిన మజ్లిస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా ఉన్నచోట సత్తాచాటుతూ వస్తోంది. ఇటీవలె మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం,బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. తాజాగా బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో సత్తాచాటింది ఎంఐఎం.

2002లో గోద్రా అల్లర్లు జరుగగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాంతం నుండి తొలిసారి బరిలోకి దిగిన ఎంఐఎం 7 స్ధానాలను గెలుచుకుంది. అహ్మదాబాద్ కార్పొరేషన్ పరిధిలో 4 స్థానాలను,మొదాసాలో 12 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 9 స్థానాలు,బరూచ్‌లో కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది పతంగి పార్టీ.

బీజేపీకి పెట్టని కోటలా ఉండే ఈ ప్రాంతంలో దశాబ్దాల తర్వాత తొలిసారి బీజేపీయేతర పార్టీ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. 44 స్థానాలున్న గోద్రా మున్సిపాలిటీలో బీజేపీ 18 స్ధానాలు గెలుపొందగా మజ్లిస్ కూటమి మిగితా స్ధానాల్లో విజయం సాధించి గోద్రాపై పతంగిని ఎగరేసింది. 9 స్ధానాల్లో పోటీచేసిన మజ్లిస్ 7 చోట్ల గెలుపొందగా మిగితా స్ధానాల్లో కూటమి సభ్యులు విజయకేతనం ఎగురవేశారు. మజ్లిస్ కూటమికి చెందిన సంజయ్ సోనీ మున్సిపల్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ….బీజేపీ చేపట్టిన అభివృద్ధి మస్లిం వర్గాల వరకు చేరలేదని అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నారు.

2002 ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు ఎస్ 6 బోగీకి దుండగలు నిప్పు పెట్టటంతో.. 59 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో గుజరాత్ లో బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. అలాంటి గోద్రాలో తొలిసారి కమలనాథులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.

- Advertisement -