పాలు అత్యంత బలవర్ధకమైన పోషక పదార్థం. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల కండర పుష్టి, ఎముకల పటుత్వం పెరగడంతో పాటు మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలు తాగాలని ఆహార నిపుణులు చెబుతుంటారు. అయితే ఒట్టి పాలు మాత్రమే కాకుండా కొందరు పాలు తేనె, పాలు పండ్లు కలిపి సేవిస్తుంటారు. ఇలా సేవించడం కూడా మంచిదే అయినప్పటికి.. కొన్ని రకాల పదార్థాలను పాలతో కలిపి అసలు తినకూడదని చెబుతున్నారు ఆహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాం !
మాంసాహారం
మాంసాహారాన్ని పాలతో కలిపి అసలు తీసుకోకూడదట. పాలు, మరియు మాంసాహారం రెండు కూడా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు కావడంతో ఆ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వాంతులు, అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
నిమ్మకాయ
నిమ్మకాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల నిమ్మరసాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. అంతే కాకుండా కడుపులో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది.
అరటిపండు
అరటిపండును కూడా పాలతో కలిపి అసలు తీసుకోకూడదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాలతో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఇంకా ముల్లంగి రసం, బీట్ రూట్ రసం., పెరుగు వంటి వాటితో కూడా పాలను అసలు చేర్చకూడదు. ఈ కాంబినేషన్ ఇతరత్రా రోగాలకు కారణమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:Telangana Congress:కాంగ్రెస్ బీజేపీ.. కలిసి పోటీ?