పాల వ్యాన్‌లో మద్యం సరఫరా..సీజ్

121
milk
- Advertisement -

పాలు వ్యాన్ లో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 20 లక్షల రూపాయలు విలువచేసే పదివేల కర్ణాటక మద్యం బాటిళ్లు చిత్తూరు తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల వ్యాన్ సీజ్ చేశారు.

చిత్తూరు వేలూరు రహదారులో మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా వేలూరు నుంచి చిత్తూరుకు పాల మినీ లగేజ్ వెహికల్ వస్తుంది దానిని తనిఖీ చేయగా పదివేల కర్ణాటక మద్యం బాటిళ్లు గుర్తించామని తెలిపారు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. ఈ కేసులో పూతలపట్టు మండలం చిటిపి రాళ్ళ గ్రామానికి చెందిన కార్తీక్ ఐరాల మండలం కాణిపాకం మిట్టయిండ్లు కు చెందిన రాళ్లపల్లి సురేష్ బాబు అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

- Advertisement -