ఫైటర్‌…విజయ్ దేవరకొండ వర్సెస్ టైసన్‌!

532
mike tyson
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్‌. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్- చార్మితో పాటు కరణ్ జోహర్ నిర్మిస్తుండగా విజయ్ దేవరకొండ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా కరోనా కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది.

ఇక ఈ సినిమాపై ధీమాగా ఉన్నారు దర్శకుడు పూరి. తన కెరీర్‌లోనే ఫైటర్ బెస్ట్ సినిమా అవుతుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనుండగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది ఫైటర్.

ఇక ఈ సినిమాలో విజయ్‌తో ఫైట్ చేసేందుకు మైక్ టైసన్‌ని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారట పూరి. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఇటీవలె ఫైటర్‌ కథలో పూరి ….మార్పులు చేస్తున్నట్లు వార్తలు రాగా వాటిని ఖండించారు ఛార్మి. ఫైటర్‌ కథలో ఎలాంటి మార్పులు ఉండబోవని తొలుత అనుకున్న కథ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కుతుందని చెప్పారు.

- Advertisement -