వ‌ర‌దల్లో చిక్కుకున్న ప్రముఖ సింగర్‌.. కాపాడిన ఫ్యాన్స్‌..

111
Mika Singh
- Advertisement -

గత కొద్ది రోజులుగా ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో వర్షాలు వరదల వలన వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మరణించారు. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ భారీ వర్షాలతో సామాన్యుడితో పాటు సెల‌బ్రిటీలు కూడా నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ సింగ‌ర్, ర్యాప‌ర్ మికాసింగ్ కారు వ‌ర‌ద నీటిలో చిక్కుకుంది..

ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వ‌స్తున్న స‌మ‌యంలో మికా సింగ్ కారు వ‌ర‌ద నీటిలో చిక్కుకుంది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు వెంట‌నే అక్క‌డ‌కి చేర‌కొని సాయం చేశారు. వారి సాయంతో అక్క‌డ నుండి బ‌య‌ట ప‌డ్డారు. దాదాపు 200 మంది వరకు జనాలు నాకు సాయం చేయడానికి వచ్చారు. వారందరికి నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు మికా సింగ్.

- Advertisement -