మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ రోజు రోజుకు బలపడుతోంది. ఆ రాష్ట్రంలోని కీలక నేతలంతా బిఆర్‌ఎస్ వైపు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా అందరి దృష్టి బిఆర్‌ఎస్ పై పడింది. ఆ రాష్ట్ర ప్రజలు మరియు ఇతర పార్టీల నేతలు బిఆర్‌ఎస్ ను ప్రత్యామ్నాయ పార్టీగా భావిస్తుండడంతో ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్‌ఎస్ హాట్ టాపిక్ అయింది. ఇక కేసిఆర్ కూడా మహారాష్ట్ర పైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ వరుస పర్యటనలు బహిరంగ సభలు నిర్వహిస్తూ అక్కడి ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. దీంతో బిఆర్‌ఎస్ బలపడుతున్న తీరు అక్కడి ప్రధాన పార్టీలకు బెరుకు పుట్టిస్తోంది.
Also Read: నిర్మల్…జూన్4న సీఎం కేసీఆర్ టూర్
తాజాగా శివసేన పార్టీకి చెందిన కీలక నేత బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏక్ నాథ్ షిండే ( శివసేన ) వర్గానికి చెందిన ప్రవీణ్ షిండే కేసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ ప్రాతినిథ్యం వహిస్తున్న సౌత్ నాగ్ పూర్ అసెంబ్లీ నియోజిక వర్గానికి చెందిన ప్రవీణ్ షిండే.. స్థానికంగా బలమైన నేతగా గుర్తింపు ఉంది. అలాంటి నేత బిఆర్‌ఎస్ లో చేరడంతో అటు శివసేన అటు బీజేపీ రెండు పార్టీలకు కూడా మింగుడు పడడం లేదు. ఇక రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల నుంచి మరికొంత మంది నేతలు బిఆర్‌ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తో శివసేన, బీజేపీ పార్టీలు గట్టి పోటీ ఎదుర్కొనున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: CM KCR:ధార్మిక సమాచార కేంద్రంగా బ్రహ్మణ సదన్