KTR:మైగ్రేషన్‌ నుంచి ఇరిగేషన్‌..

46
- Advertisement -

మైగ్రేషన్ నుంచి ఇరిగేషన్‌కు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్న, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

Also Read: CMKCR:వలసల కాలం పోయి పంటల కాలం వచ్చింది

ఈ సందర్భంగా మాట్లాడుతూ…మంచి చేయాలనే ఆలోచన చాలా గొప్ప విషయమన్నారు. మోహన్‌రెడ్డి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిందని 6లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించి, పెద్ద వ్యవస్థలో సీట్లు సంపాదిస్తే తమకు ఎంతో ఆనందకరమైన విషయమని తెలిపారు. ఆరోజుల్లో పరిశ్రమల స్థాపనకు రెడ్ టేప్ ఉండేది కానీ నేడు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని అన్నారు. నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్ మనదేనన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మునుపెన్నడూ సాధించని ఘనతను సాధించామని అన్నారు.

Also Read: KTR:రాష్ట్రంలో చెరువుల పండుగ

- Advertisement -