- Advertisement -
ముస్తాబాద్ కు పని కోసం వచ్చిన ఒరిస్సా కు చెందిన వలస కార్మికులు లాక్డౌన్ సందర్భంగా కాలినడకన తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్తూ రెండు రోజుల క్రితం పెద్దూరు చేరారు. వారికి స్థానిక నాయకులు ఆశ్రయం ఇచ్చి రెండు రోజులుగా భోజనాలు ఏర్పాటు చేశారు. వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పెద్దూరులోనే ఉండిపోయారు.
ఈ విషయం వలస కార్మికులు శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్ కు ఫోన్ కాల్ ద్వారా తెలియజేయగా, వారిని తరలించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హుటాహుటిన అధికార యంత్రాగం సంఘటన స్థలానికి చేరుకొని వారిని ప్రత్యేక వాహనాలలో స్వస్థలానికి తరలించారు.
- Advertisement -