గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న మైక్రో ఆర్టిస్ట్ రామగిరి స్వారిక..

99
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నేషనల్ అవార్డు, గిన్నిస్ రికార్డు గ్రహిత మైక్రో ఆర్టిస్ట్ రామగిరి స్వారిక ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.. ముఖ్యంగా యువత మీద ఉందన్నారు. నా వంతుగా ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటనని.. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం తన స్నేహితులు మైక్రో ఆర్ట్ గిన్నిస్ రికార్డ్ హోల్డర్ చంద్రకాంత్ చారి, గిన్నిస్ రికార్డ్ హోల్డర్ గౌరీనాథ్, రూపశిల్పి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -