ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ టీ20 వరల్డ్ కప్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టోర్నమెంట్‌లో సౌతాఫ్రికా జట్టుపై తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈ టోర్నమెంట్లో మూర్ఖమైన జట్టు సౌతాఫ్రికా అన్నారు.
సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా కావాలనే వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి ఉంటే ఇండియా టోర్నమెంట్ నుండి నిష్క్రమించేందన్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను గెలవనిచ్చి ఉంటే, భారత్‌కు సెమీఫైనల్‌కు చేరుకోవడం చాలా కష్టమయ్యేదని ఆయన పేర్కొన్నారు.
సూపర్ 8 దశలో భారత్ మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్‌కు వెళ్లాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వెస్టిండీస్ ఇప్పటికే జింబాబ్వేపై గెలిచిన నేపథ్యంలో, వారు దక్షిణాఫ్రికాను కూడా ఓడించి ఉంటే భారత్‌కు అవకాశాలు మరింత కష్టమయ్యేవని వాన్ అభిప్రాయపడ్డారు.
టోర్నమెంట్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వాన్…టోర్నమెంట్‌లో అత్యంత బలమైన జట్టుగా ఉన్న భారత్‌ను నిలువరించడానికి ఇదే సరైన అవకాశం అని అన్నారు. దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను గెలవనిచ్చి ఉంటే భారత్ టోర్నమెంట్ నుంచి బయటపడేది. అందుకే నేను దక్షిణాఫ్రికానే ఈ టోర్నమెంట్‌లో అత్యంత మూర్ఖమైన జట్టుగా భావిస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.

