- Advertisement -
మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా మెక్సికో అతివలు నడుం బిగించారు. లైంగికదాడికి పాల్పడిన తమ పార్టీ నాయకుడిని దేశాధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ సమర్థించడంతో ఆ దేశ మహిళల్లో కోపం కట్టలు తెంచుకున్నది. అతని వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దేశాధ్యక్షుడు దిగిపోవాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆ దేశ నేషనల్ ప్యాలెస్( రాష్ట్రపతి భవన్)ను ముట్టడించేందుకు ప్రయత్నించగా ఈ ఘటనలో వందల సంఖ్యలో ఆందోళన కారులతో పాటు పోలీసులు గాయపడ్డారు.
మహిళలపై అత్యధిక నేరాలు జరుగుతున్న దేశాలలో మెక్సికో ముందుంటుంది. గత ఏడాదిలో రోజుకు సగటున 10 మంది మహిళలు మరణించగా, 16 వేల మంది లైంగికదాడికి గురయ్యారు.
- Advertisement -