ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కారిడార్ పనులు..

352
Hyderabad Metro Rail
- Advertisement -

ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాకా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తామని అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్‌కి 31 కిలో మీటర్ల దూరాన్ని 5 వేల కోట్లతో పనులు చేస్తామని ఆయన అన్నారు.హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి మైండ్ స్పేస్ స్టేషన్ కూడా అందుబాటులోకి తీసుకోస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు.

హైటెక్ సిటీ రివర్సల్ సౌకర్యం పూర్తయింది. భద్రత అనుమతులు వచ్చాకా నాలుగైదు రోజుల్లోనే ట్విన్ సింగిల్ లైన్ విధానం అమలు చేస్తాం. హైటెక్ సిటీ నుంచి-జూబ్లిచెక్ పోస్ట్ వరకు అవసరాన్ని బట్టి మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ 3, 5 నిమిషాల వరకు కుదిస్తామన్నారు.ఈ నెల 14 తేదీన ఒక్క రోజే మెట్రోలో అత్యధికంగా 3 లక్షల 6వేల మంది ప్రయాణం చేశారని మెట్రో ఎండీ తెలిపారు.

- Advertisement -