త్వరలోనే పాతబస్తికి మెట్రో రైలుఃసీఎం కేసీఆర్

382
cm kcr
- Advertisement -

త్వరలోనే పాతబస్తికి కూడా మెట్రో రైలు సదుపాయాన్ని తీసుకువస్తామని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ద్రవ్యవినిమయ బిల్లుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సభ్యులకు సమధానమిస్తున్నారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ పై కేంద్ర ప్రభుత్వం ఎటు తేల్చడం లేదన్నారు.

అవసరమైతే త్వరలోనే అసెంబ్లీలో 12శాతం రిజర్వేషన్లపై తీర్మానం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. అసెంబ్లీలో కూడా అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ లో ఏ మూలకు పోయి అడిగిన టీఆర్ఎస్ పాలన గురించి చెబుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 9కి పడిపోయింది. బీజేపీ 5 సీట్ల నుంచి ఒక సీటుకు పడిపోయింది. టీఆర్‌ఎస్ పార్టీ 63 నుంచి 88కి పెరిగింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అడ్డగోలుగా మాట్లాడుతోంది. ధైర్యం, ప్రజల విశ్వాసం ఉంది కాబట్టే ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు పోయినం. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు.

- Advertisement -