- Advertisement -
రెండోదశలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి. పాతబస్తీలో 5 కిలోమీటర్ల మెట్రోకు ప్లాన్ చేస్తున్నామని..రెండో దశలో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు 31 కిలోమీటర్లు…లక్డీకపూల్ నుంచి ఎయిర్‌పోర్టుకు నూతన రూట్లు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు కూడా మెట్రో ఆలోచన ఉందన్నారు. రెండో దశ కోసం ఢిల్లీ మెట్రో డీపీఆర్ సిద్ధం చేశారన్నారు.
ప్రస్తుం ప్రయాణికుల నుంచి రోజుకు రూ. కోటి ఆదాయం వస్తుందన్నారు. మెట్రో మాల్స్ నుంచి నెలకు రూ. 10 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు ఎన్‌వీఎస్ రెడ్డి. హైదరాబాద్ మెట్రోకు 269 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఇప్పటివరకు మెట్రోలో 16 కోట్ల మంది ప్రయాణం చేశారని తెలిపారు.
- Advertisement -