దళిత బంధువు…సీఎం కేసీఆర్

197
trs mla
- Advertisement -

సీఎం కేసీఆర్ దళిత బంధువు అని కొనియాడారు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. టీఆర్ఎస్ ప్లీన‌రీలో ద‌ళిత బంధుపై తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన సందర్భంగా మాట్లాడిన ఆనంద్.. తెలంగాణ రాష్ట్రంలోని ద‌ళితులంద‌రూ త‌న బంధువులే అని తెలుపుతూ.. ద‌ళిత బంధు ప‌థ‌కానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు.

ద‌ళితులు అత్యంత వివ‌క్ష‌ను ఎదుర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాలు ద‌ళితుల‌కు అంద‌లేదు. ఇప్ప‌టికీ క‌డుపునిండా తిన‌ని ద‌ళితులు ఉన్నారు. నిరక్ష్య‌రాసులు కూడా ద‌ళితుల్లోనే ఎక్కువ ఉన్నారు. ఈ ద‌ళిత బంధు ప‌థ‌కంతో ద‌ళితుల జీవితాల్లో వెలుగులు వ‌స్తాయ‌న్నారు.

గ‌త పాల‌కులు ద‌ళితుల‌ను ప‌ట్టించుకోలేదు. ద‌ళితుల బాధ‌ల‌ను చూసి చ‌లించిపోయిన సీఎం కేసీఆర్.. ద‌ళిత బంధు ప‌థ‌కానికి అంకురార్ప‌ణ చేశారు. ప్ర‌తి ఇంట్లో సంక్షేమం ఉండాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ద‌ళితుల వ‌ద్ద పెట్టుబ‌డి లేక‌నే వెనుకంజ‌లో ఉన్నారు. భార‌త‌దేశానికే ఈ ప‌థ‌కం దిక్సూచిగా మార‌బోతుంద‌న్నారు.

- Advertisement -