రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు..ప్రాజెక్టులకు జలకళ

287
heavy rains
- Advertisement -

బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతంలో వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల ట్రాపిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.

heavy rains

ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సహా… మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లాగా మారాయి. చెరువులకు, ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ 6 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. అటు భారీ వర్షాలకు నాగార్జునసాగర్‌ కు వరద ఉధృతి పెరిగింది. నాగార్జునసాగర్‌ లో ప్రస్తుత నీటిమట్టం 538.90 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది.

heavy rains

కృష్ణా బేసిన్‌లోని జలాశయాలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నదిపై మొదటగా ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతంగా వస్తుండడంతో 1.38 లక్షల క్యూసెక్కుల వరద నీరు కిందకు వదులుతున్నారు. మరోవైపు దశాబ్ధకాలంలోనే ఎన్నడూ లేనంతగా తుంగభద్ర నదికీ వరద పోటెత్తడంతో దిగువన ఉన్న శ్రీశైలానికి 3.53 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది.

- Advertisement -