మెస్సీ లేని అర్జెంటీనా ఉహించలేం!

0
- Advertisement -

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ వెల్లడించిన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు గుప్పించారు. 10వ నంబర్ జెర్సీ లేకుండా అర్జెంటీనా జాతీయ జట్టు జెర్సీ ఇకపై ఎప్పటికీ మునుపటిలా అనిపించదని ధావన్ వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా వేదికగా ధావన్ స్పందిస్తూ.. మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రయాణాన్ని కొనియాడారు. తీవ్రమైన ఒత్తిడి, పట్టుదల, ఓటములు మరియు చివరికి అద్భుత విజయాలతో నిండిన కెరీర్ ఇది. ఎంతటి గొప్ప వారసత్వాన్ని అందించి వెళ్తున్నావు మెస్సీ అని ధావన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ధావన్‌తో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా మెస్సీ అంతర్జాతీయ వీడ్కోలుపై స్పందిస్తూ చరిత్ర రాస్తున్న సమయంలోనే దిగ్గజాలుగా (లెజెండ్స్) మారే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. లియో నువ్వు వారిలో ఒకడివి. ఎంతటి అద్భుతమైన కెరీర్! మైదానంలో చివరి విజిల్ మోగిన తర్వాత కూడా క్రీడా ప్రపంచం నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ని యువరాజ్ ఇన్స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Also Read:రాహుల్ అసత్యప్రచారం..మోదీ ఫైర్

అర్జెంటీనా తరఫున అత్యధికంగా 203 మ్యాచ్‌లు ఆడి 124 గోల్స్ చేసిన మెస్సీ, దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు.

- Advertisement -