నాగోబా జాతర ప్రత్యేకతలివే…

49
- Advertisement -

అత్యంత ప్రాచీన  నాగరికత కలిగిన భారతీయ ప్రజలు అడవిని పూజించడం ఆనావాయితీగా వస్తోంది. ఇందులో ప్రతి మొక్కను, చెట్టును, పుట్టను మొక్కి తమ తమ కొర్కెలను తీర్చుకుంటారు. ముఖ్యంగా అడవుల్లో ఉండే ఆదివాసీల అడవిని పూజిస్తారు. అయితే ఈ పూజా విధానం చాలా వరకు ఆయా వంశీయుల నుండి ఆచారంగా వంశపారపర్యంగా కొనసాగిస్తున్నారు.  అలాంటి జాతరలో ఒకటి…నాగోబా జాతర. అడవి బిడ్డల అడ్డా అయిన ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్‌లోని నాగోబా జాతర అత్యంత ప్రాచీనమైంది. మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా.

మెస్రం వంశీయులు స్వయంగా పునఃనిర్మించుకున్న నాగోబా ఆలయంలో ఈయేడాది అత్యంత వైభవంగా పూజలు మొదలు కాబోతున్నాయి. పుష్య మాస అమావాస్య రోజున జాతర మొదలవుతుంది. జాతర కోసం మహారాష్ట్ర చత్తీస్‌ఘడ్‌ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున్న ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌కు చేరుకుంటారు. మెస్రం వంశీయులు నిర్వహించే జాతరలో గంగాభిషేకంతో ప్రారంభమవుతుంది. పవిత్రమైన గోదావరి జలాలను నాగోబా గుడికి కాలినడకన మెస్రం వంశీయులు మోసుకొని వస్తారు. అదొక చీమల బారుల కనపడుతుంది.

మర్రిచెట్ల నుంచి పూజ సామాగ్రి సేకరించి వాటితో మెస్రం వంశీయులు ఆలయంకు చేరుకుంటారు. ఈ పాదయాత్ర చూసేందుకు ప్రజలు ఎక్కడినుండో వస్తారు. ఏడు కావడిలలో నెయ్యి పుట్టతేనే బెల్లం గానుగ నూనె వంటి వస్తువులు ఉంచుకోని 125గ్రామాలు తిరుగుతూ…కాలినడకన ప్రయాణిస్తారు. మూడురోజులు పాటు కోలాహాలంగా ఈ జాతర సాగుతోంది. దీనికి స్థానికి ఎంపీ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులు హాజరవుతారు. చివరి రోజైన నాగోబా జాతరలో భాగంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి…

దటీజ్ హరీశ్‌రావు…

గూగుల్‌లో లేఆఫ్‌..మాంద్యమే కారణమా!

జనవరి 27న… టీచర్ల బదిలీలు

- Advertisement -