మాటలు లేని మెర్క్యూరీ.. ట్రైలర్

411
- Advertisement -

భారతీయ సినీ ప్రస్థానం మూకీగా ప్రారంభమైనప్పటికి మాటలు తోడయ్యాక వాటి ఉనికి పూర్తిగా మాయమయ్యింది. ముప్పై ఏళ్ళ క్రితం దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ తో పుష్పక విమానం పేరుతో ఒక ప్రయోగం చేస్తే అది బాషా బేధం లేకుండా అన్ని వర్గాలను విపరీతంగా ఆకట్టుకుని కమర్షియల్ గా విజయం అందుకుంది. తర్వాత మళ్ళి ఎవరూ సైలెంట్ మూవీ చేసే సాహసం చేయలేకపోయారు. మళ్ళి ఇన్నాళ్లకు క్రియేటివ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సాహసానికి పూనుకున్నాడు. అతను రూపొందించిన సినిమా మెర్క్యూరీ.

Mercury Movie Trailer

ప్రభుదేవా ప్రధాన పాత్రగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘మెర్క్యురీ’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా నుంచి ఇంతకుముందు వదిలిన టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సైలెంట్ థ్రిల్లర్ గా ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు రూపొందించాడు. ఈ సినిమాలో మాటలు వుండవు. సైలెంట్ గానే పాత్రలు కదులుతుంటాయి.

అనుకోని పరిస్థితుల్లో ఒక సైకో ఉచ్చులో చిక్కుకొన్న కొంతమంది అబ్బాయిలు .. అమ్మాయిలు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు చేసే ప్రయత్నాలపైనే ట్రైలర్ ను కట్ చేశారు. హారర్ థ్రిల్లర్స్ పట్ల ఆసక్తిని చూపేవాళ్లలో ఈ ట్రైలర్ ద్వారా ఉత్కంఠను రేపడంలో టీమ్ సక్సెస్ అయింది. ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -