వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఆసియా దేశాలలో పురుషులు ప్రపంచంలోనే అత్యధికంగా సిగరెట్లు తాగుతున్నట్లు తేలింది. ప్రధానంగా ఇండోనేషియా, మయన్మార్ వంటి దేశాల్లో పురుషుల ధూమపానం శాతం 70% దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలో 42% మంది పురుషులు సిగరెట్ తాగుతున్నారు. దీంతో భారత్ ప్రపంచంలో అత్యధికంగా సిగరెట్ తాగే పురుషులున్న దేశాలలో 13వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం, ధూమపానం ఆసియాలోని అనేక దేశాల సాంస్కృతిక, సామాజిక అలవాట్లలో బలంగా స్థిరపడింది.
ఇండోనేషియా – 70.5% శాతంతో అగ్రస్థానంలో ఉండగా మయన్మార్ – 70.2% రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ – 60.6%,చిలీ – 49.2%,
చైనా – 47.7% మంది పరుషులు సిగరెట్ తాగుతున్నారు.
భారత్ అగ్రస్థానంలో లేకపోయినా, 42% పురుషులు సిగరెట్ తాగుతున్నారనే విషయం ఆందోళనకరం. ఇది ఫ్రాన్స్ (36%), దక్షిణ కొరియా (38.2%), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (35.6%) వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ. ఆ దేశాలు పన్నులు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, మరియు కఠిన నియంత్రణలతో ధూమపానాన్ని కొంతవరకు నియంత్రించాయి.
భారత్లో సమస్య కేవలం సిగరెట్ తాగడమే కాదు, బీడీలు, గుట్కా, పాన్పరాగ్, మరియు చప్పరించే పొగాకు వంటివి కూడా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు కలిగిస్తున్నాయి.
Share of men who smoke cigarettes.
🇮🇩 Indonesia: 70.5%
🇲🇲 Myanmar: 70.2%
🇧🇩 Bangladesh: 60.6%
🇨🇱 Chile: 49.2%
🇨🇳 China: 47.7%
🇿🇦 South Africa: 46.8%
🇬🇷 Greece: 45.3%
🇱🇰 Sri Lanka: 43.2%
🇲🇾 Malaysia: 42.7%
🇹🇭 Thailand: 42.5%
🇪🇬 Egypt: 42.3%
🇰🇿 Kazakhstan: 42.2%
🇮🇳 India: 42%
🇵🇭…— World of Statistics (@stats_feed) November 6, 2025
Also Read:ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ గుర్తుకొచ్చారా?

